కర్నూలు జిల్లా, కోడుమూరు మండలంలోని ముడుమలగుర్తిలో మంగళవారం సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జయంత్యుత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వాచనం, అభిషేకం, కుంకుమార్చన, హోమం నిర్వ హించారు. అనంతరం ఉత్సవమూర్తులను పట్టువ స్ర్తాలు, పూలమాలలతో అలంకరించి కల్యాణ వేదిక పైకి చేర్చారు. పండితుల వేదమంత్రోచ్చరణలు, మంగళవా యిద్యాల మధ్య కల్యాణం నిర్వహిం చారు. సాయంత్రం రథోత్సవం సందర్భంగా టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీ విష్ణువర్ధన్‌రెడ్డి టెంకాయ కొట్టి ప్రారంభించారు. దీంతో భక్తులు రథాన్ని ఎదురు మండపం వరకు లాగి తిరిగి ఆలయం చేర్చారు. రాత్రి చిన్నారుల డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీ అలరిం చింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారి రంగన్నస్వామి, ప్రహ్లాదరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మల్లేష్, మధు, గోకారి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa