తెలంగాణ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో అక్కడి ఏసీబీ అధికారులు మంగళవారం రెండు తెలుగు రాష్ర్టాల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెంలో గల ఉమామహేశ్వరరావు బంధువుల ఇంట్లో తనిఖీలు చేశారు. ఆయన ఆస్తులకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు లభించినట్టు తెలిసింది. తెలంగాణ ఏసీబీ సోదాలకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని పెందుర్తి సీఐ రామకృష్ణ తెలిపారు.