అక్రమ కేసులతో భయపెట్టి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్యారెక్టర్‌ను అశాసినేట్ చేస్తూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని, పచ్చమీడియా ఛానళ్లల్లో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఈవీఎం ఘటనను చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం..? అని ప్రశ్నించారు. పిన్నెల్లి 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే ప్రజాబలంతో మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని గుర్తుచేశారు.