శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపం వరకు సాగింది. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు గోవిందనామస్మరణతో రథాన్ని లాగారు. అలాగే 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి ఊరేగనున్నారు.