నాగులుప్పలపాడు జాతీయ రహదారిపై శునకాలు దడపుట్టిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులపై మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతుండటంతో రోడ్లపై ప్రయాణాలు చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పలు గ్రామాలలో కూడా పదుల సంఖ్యలో శునకాలు దర్శనమిస్తున్నాయి. నాగులుప్పలపాడులోని ప్రధాన వీధి, పోలీసు స్టేషన్ బజార్, బస్టాండ్ సెంటర్లో స్వైరవిహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.