సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కనిగిరి డిఎస్పి రామరాజు హెచ్చరించారు. బుధవారం కనిగిరి పట్టణంలోని స్థానిక డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రజలందరూ సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.