జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె వెబ్ ఎక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన, బీజేపీ కూటమి గెలిచే అవకాశమే ఎక్కువగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో ఆమె ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గానికి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా నేతలు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. పోస్టల్ బ్యాలట్ కౌంటింగ్‌కు 500ఓట్లకు ఒక్కో టేబుల్ చొప్పున ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో కూటమిలో ఉన్న సమన్వయం.. కౌంటింగ్ ప్రక్రియలోనూ చూపించి పని చేయాలని కోరారు. భాజపా, తెదేపా, జనసేన కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు.