గిద్దలూరు పట్టణంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరునాళ్ల, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు గురువారం స్వామి వారి కి గరుడ ఉత్సవం, ఊంజల్ సేవ నిర్వహించారు. నియోజకవర్గ దేవాల యాల కమిటీ ఆధ్వర్యంలో భరత నాట్య ప్రదర్శన నిర్వహించగా పలు వురిని అలరించింది. భరతనాట్య ప్రదర్శనకు హాజరైన మహిళలకు పట్టుకుంటే పట్టుచీర కార్యక్రమంలో భాగంగా లక్కీడిప్ ద్వారా 20 మందికి చీరలు అందచేశారు.