శింగనమల మండల వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలలో 400 మంది రైతులకు వేరుశనగ పంపిణీ చేసినట్లు శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్ తెలియజేశారు. వేరుశనగ కోసం పేర్లు నమోదు చేసుకున్న రైతులకు పంపిణీ రేపు కూడా ఉంటుందని తెలియజేశారు. శింగనమల మండల వ్యాప్తంగా వున్న రైతులు విత్తన వేరుశనగ కాయలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.