ధర్మవరం మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన ఓబులనాయన పల్లిలో ధర్మవరం రూరల్ ఎస్సై నరేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని పలువురు అనుమానితుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న సందర్భంలో గ్రామంలో రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఎటువంటి కక్షలు, కార్పణ్యాలు ఉండకూడదని, గొడవలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.