బ్రహ్మంగారి మఠం మండలం లింగాలదిన్నె గ్రామ సమీపంలో శుక్రవారం ప్రమాదశాత్తు ఓ లారీ మంటల్లో పూర్తిగా దగ్ధమయింది. వివరాలకెళ్ళితే ప్రొద్దుటూరు నుండి పోరుమామిళ్ళకు టొమోటో లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa