ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు కండీషన్లో ఉండాలని, ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్‌నాయక్ తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా, చాగలమర్రి పోలీసు స్టేషన్లో ఇటీవల ప్రమాదానికి కారణమైన వాహనా లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పాఠశాలలు ప్రారంభించేలోపల చేయించుకోవాలని తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన సీనియర్ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బస్సుల కండిషన్, టైర్లు, హెడ్లైట్లు బాగుండాలని, అత్యవసర సమయంలో పిల్లలు దిగడానికి వీలుగా బస్సు ఫుట్‌బోర్డు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఫస్ట్ ఎయిడ్ బాక్సు, అగ్నిమాపక రక్షణ పరికరాలు లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వ బోమని చెప్పారు. వాహనదారులు లైసెన్స్‌లు తప్పనిసరిగా పొందా లన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రమణయ్య, పోలీసులు ఉన్నారు.