ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్‌కు నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 06:53 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో  టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి హడావుడి చేసిన సంగతి తెలిసిందే.! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి.. తన మిత్రుడిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను బన్నీ కోరారు. ఈ సందర్భంగా.. భారీ జనసమీకరణతో వివాదం తలెత్తింది. దీంతో అల్లు అర్జున్‌కు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా.. ఈ వివాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపారు ఉన్నతాధికారులు. ఎస్‌బికి చెందిన స్వామి నాయక్, నాగరాజులను వీఆర్‌కు పంపుతున్నట్లు శనివారం ఉదయం పోలీసులు ప్రకటనలో తెలిపారు. భారీ జనసమీకరణ జరుగుతుందన్న సమాచారం ఇవ్వకపోవడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. కాగా.. ఇప్పటికే ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేయడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com