నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. నాపై టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా నేను తిరిగి ఒక్క మాట కూడా అనలేదన్నారు. శనివారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడ్ని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడ్ని. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడ్ని. గత ఐదేళ్లు గా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చేసులేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతం గా చంద్రగిరి లో జరిగింది. గత ఐదేళ్లు గా నాని కుటుంబం పై చిన్న కేసు నమోదు చేయలేదు. నా బావమరిదిని పులివర్తి నాని చేయి చేసుకున్నాడు. నామినేషన్ రోజు నా కారుపై దాడి చేశారు. పులివర్తి నాని క్వారీలు పై దాడి చేయలేదు, వారి ఆస్తులు జోలికి వెళ్ళలేదు. 2014 -19 లో టీడిపి వాళ్లు నేను తప్పు చేసే నన్ను ఊరుకునే వారా ? గత ఐదుదేళ్ళుగా ఒక్క కేసు పెట్టలేదు. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటి వద్ద నానికు ఎలాంటి గాయాలు లేవు. గన్‌మెన్ ఈశ్వర్ రెడ్డిని కొట్టారు.నా కారుపై నామినేషన్ దాఖలు సమయంలో దాడి చేశారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు , సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు,కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విషప్రచారం చేస్తున్నారు,దాడి జరిగిన తర్వాత నాని చాలా యాక్టీవ్ గా ఉన్నాడు.. రెండు గంటల తర్వాత వీల్ చైర్ లో కూర్చుని డ్రామాలు చేస్తున్నారు. పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నేను రాజకీయ ప్రత్యర్థులుగా చూశాను, వ్యక్తిగత శత్రువులుగా నేను చూడలేదు అని అన్నారు.