అభ్యర్థులు, ఏజెంట్లు కౌటింగ్ నిబంధనలన తుచ తప్పకుండా పాటించాలని దర్శి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ఎంవీవీఎస్ లోకేశ్వరరావు సూచించారు. శనివారం స్థానిక ఆర్‌వో కార్యాలయంలో రాజకీయ నాయకుల ప్రతినిధులు, అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్‌లో ఏజెంట్లుగా పాల్గొనవలిసిన వారు వెంటనే ఫాం-18 సమర్పించాలన్నారు. కౌటింగ్స్‌లో 14 టేబుల్స్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. కౌంటింగ్ 21 రౌండ్లలో పూర్తవుతుందని తెలిపారు. కౌంటింగ్ పూర్తయిన తరువాత ఎలాంటి సభలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. బాణసంచా కాల్చడాన్ని నిషేధించినట్టు చెప్పారు. ఏజెంట్లు కౌంటింగ్ సమాచారాన్ని ముందుగా బహిర్గతం చేయరాదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయపార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.