ఎర్రగుంట్ల మండల పరిధిలోని కడప-తాడిపత్రి జాతీయ రహదారి రాణివనం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు. ఎర్రగుంట్ల మండలం, రాణివనంకు చెందిన ఫరూక్ తన తల్లి దిల్షానాతోపాటు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫరూక్ తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, ఫరూక్కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.