ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి సీఎం జగన్ పరిపాలన చూడబోతున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 05:52 PM

జూన్‌ 4 తర్వాత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు లక్ష్మీ పార్వతి విశ్వాసం వ్య‌క్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయ‌కురాలు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నాయి. జూన్‌ 4 తర్వాత  వైయ‌స్ జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంద‌న్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com