మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14మంది, మాచర్ల టౌన్‌కు చెందిన 10మంది, మాచర్ల రూరల్‌కు చెందిన 22మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వీరంతా ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు పాల్పడినవారే. వీడియో ఫుటేజ్ ఆధారంగా వారిపై కేసులు, రౌడీ షీట్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.