ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన వేరుశనగ విత్తనాలను రైతులకు అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్ లో ఉన్న విజయ ఆగ్రో సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వేరుశనగ విత్తనాల నాణ్యతను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నాణ్యతలేని విత్తనాలను సరఫరా చేయరాదన్నారు.