ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పంపించిన నోట్ బుక్స్ ను మండల విద్యాశాఖ అధికారి మదన్మోహన్ పరిశీలించారు. బుధవారం కంబదూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిలువ ఉంచిన నోట్ బుక్స్ బాక్సులను విద్యాశాఖ అధికారి, సిబ్బంది లెక్కించారు. నోట్ బుక్స్ నాణ్యతను కూడా పరిశీలించారు. త్వరలో 42గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తామని అధికారులు తెలిపారు.