పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతామని ధర్మాసనం వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై RO సీల్ లేకున్నా చెల్లుతుందని ఈసీ తెలుపగా.. దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది.