దాదాపు 2 నెలలుగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ నేటితో పూర్తైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలోనే అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ వైపే ఉంది. ఇప్పటివరకు విడుదలైన ఒపీనియన్ పోల్స్ కంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే.. ఫైనల్ రిజల్ట్స్‌కు దగ్గరగా ఉండటంతో.. దేశం మొత్తం వాటి కోసమే ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే ఏ ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఏం చెప్పనుంది అనే ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే గతంలో ఏ సర్వే సంస్థ.. తుది ఫలితాలకు అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఎగ్జిట్ పోల్స్ సంస్థ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని అంచనా వేసింది అనే దాన్ని బట్టి ఈసారి ఎన్నికల్లో అవి విడుదల చేసే ఎగ్జిట్ పోల్స్‌ను ఎంతవరకు నమ్మాలి అనేది చర్చ జరుగుతోంది.
అయితే ఎగ్జిట్ పోల్స్‌ను ఎన్నో మీడియాలు, ఇతర ప్రైవేటు సంస్థలు విడుదల చేస్తూ ఉంటాయి. కానీ అందులో చాలా వరకు.. తుది ఫలితాలకు దగ్గరగా ఉన్న వాటిని పరిగణలోకి తీసుకుని ఆయా సంస్థలు అప్పుడు ఏం ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరించాయి అనేది చూద్దాం. ప్రముఖంగా ఇండియా టుడే-యాక్సిస్, న్యూస్ 24- టుడేస్ చాణక్య, న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్, టైమ్స్ నౌ వీఎంఆర్, ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటాయి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలు:
ఎగ్జిట్ పోల్ సంస్థ
ఎన్డీఏ కూటమి
యూపీఏ కూటమి
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా 339-365 77-108
న్యూస్ 24- టుడేస్ చాణక్య 350 95
న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ 336 82
టైమ్స్ నౌ వీఎంఆర్ 306 132
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ 300 120
సుదర్శన్ న్యూస్ 305 124
ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫైనల్ రిజల్ట్
353 93
2014 సార్వత్రిక ఎన్నికల్లో సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలు:
ఎగ్జిట్ పోల్ సంస్థ
ఎన్డీఏ కూటమి,,,యూపీఏ కూటమి
ఇండియా టుడే-సిసిరో 272 115
న్యూస్ 24-చాణక్య 340 101
సీఎన్ఎన్ ఐబీఎన్-సీఎస్‌డీఎస్ 280 97
టైమ్స్ నౌ-ఓఆర్‌జీ 249 148
ఏబీపీ న్యూస్-నీల్సన్ 274 97
ఎన్డీటీవీ-హాన్సా రీసెర్చ్ 279 103
ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫైనల్ రిజల్ట్
336 60
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పలు సర్వే సంస్థలు సర్వేలు చేసి ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ క్రమంలోనే 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆయా సర్వే సంస్థలు ఏం ఎగ్జిట్ పోల్స్ వెలువరించనున్నాయి అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.