ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు విడుదల చేయాలి, ఎప్పుడు విడుదల చేయకూడదు అనే దాని గురించి చట్టం, మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం అన్ని దశల ఓటింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం సాధ్యం కాదు. ఒక వేళ ఈసీ ఇచ్చిన గడువు కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తే అందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జరిమానాలు, లేదా 2 ఏళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశాలు ఉంటాయి.