ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని రైల్వేకోడూరు మండల సీపీఐ కార్యదర్శి దార్ల రాజశేఖర్ డిమాండ్ చేశారురు. శనివారం అనంతరాజు పేట గ్రామ పంచాయితీ పరిధిలోని నారాయణరాజుపోడు గిరిజనకాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నిరుపేద దళిత, గిరిజనులకు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోరాటాల ఫలితంగా పేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. చంద్రబాబు, వైఎస్ జగన ప్రభుత్వాల్లో భూములను పంచిన పాపాన పోలేదన్నారు. దళితులు, గిరిజనులకు భూములు ఇవ్వాలని ఈ నెల 10న రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి మొగిలి వినయ్, నారాయణ రాజు పోడు గిరిజన కాలనీ వాసులు చంగయ్య, సుబ్బరాయుడు, వెంకటేష్, ఈశ్వరమ్మ, వెంకటమ్మ, సుభాషిని, గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.