శ్రీకాకుళం జిల్లా, కంచిలి పరిధిలోని బొగాబెణి గ్రామానికి చెందిన వసంత్ కుమా ర్ మనుమడు శ్రీరామ్ పాణిగ్రాహి (13) గురువారం రాత్రి పాము కాటుకు గురై, చికిత్స పొందుతూ శనివారం బరంపురం ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం కళింగదళ్కి చెందిన శ్రీరామ్ పాణిగ్రాహి తన తాత వసంత్ కుమార్ ఇంటి వద్ద ఉంటూ గ్రామంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా, మెడ ఎడమవైపున పాము కాటు వేసింది. బాలుడిని వెంటనే సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం బరంపురం పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.