కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వారసుడు కావాలనే భర్త, అత్తమామల కోరిక నిండు గర్భిణీ ప్రాణాలు తీసింది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. యనమలకుదురు గ్రామంలో 5నెలల గర్భిణీ సందు కావ్యశ్రీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కావ్యశ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. రెండోసారి ప్రెగ్నెంట్ కాగా.. విజయవాడలో భర్త శ్రీకాంత్ స్కానింగ్ తీయించారు. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. అడ్డుకోవాల్సిన అత్తమామలు సైతం వేధింపులకు గురి చేశారు. అబార్షన్ ఇష్టం లేదని పలుమార్లు భర్తకు నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మీకు వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ్ చేసిన అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa