ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాంటి అవాంతరాలు జరగడానికి వీల్లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 02, 2024, 08:02 PM

అథారిటీ లెటర్స్ కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలి. వారు సెల్ ఫోన్ కలిగి ఉన్నప్పటికీ అభ్యంతరం చెప్పరాదు. అయితే కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ ఫోన్‌తో అనుమతించడానికి వీల్లేదు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లేందుకు, వచ్చేందుకు ప్రణాళిక పటిష్ఠంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రణాళికకు జిల్లాస్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి అని ఈసీ ముకేశ్ కుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ.....  ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేయాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పక్కాగా పాటించాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21సి/21ఈలు మరుసటి రోజు ఈసీఐకి చేరాలి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు. "ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్రాల్లో అల్లర్లకు ప్రయత్నించే వారిని బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ దృష్ట్యా లెక్కింపు జరిగే 4వ తేదీతోపాటు ముందు, తర్వాతి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలి. ఈవీఎంల కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలి. మరుసటి రోజు చేద్దాంలే అనుకుంటూ వాయిదా వేయడానికి వీల్లేదు. ఇండెక్స్ కార్డులో ఎటువంటి తప్పులకూ ఆస్కారం లేకుండా జాగ్రత్తగా పూరించాలి. ఆయా కార్డులు అన్నీ ఈనెల 8లోగా అన్నీ కార్యాలయాలకు అందజేయాలి" అని ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సుస్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa