ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేము గెలవకపోతే నాలుక కోసుకుంటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 02, 2024, 08:03 PM

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ- టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారితీసింది. ఒకరికొకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఖండించారు. మస్తాన్ చేత సీఎం జగన్ చెప్పించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వస్తోందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మస్తాన్ నాలుక కోసుకుంటారా అని అడిగారు. తన సవాల్‌ను స్వీకరించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పే దమ్ము ధైర్యం జగన్‌కు ఉందా అని బుద్దా వెంకన్న నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa