సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన వేముల సతీ్‌షకుమార్ ఆదివారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో డిఫెన్స్ లాయర్‌గా ఉన్న అబ్దుల్ సలీం ఆదివారం జైలు వద్దకు చేరుకుని బెయిల్ పత్రాలను అధికారులకు అందించారు. ఆ తర్వాత సతీష్‌ను జైలు నుంచి విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన సతీష్ మీడియాతో మాట్లాడారు. సీఎంపై దాడి జరిగిన విషయమే తనకు తెలియదని, రూ.300 ఇస్తామంటే కొద్ది సేపు సీఎం పర్యటనకు వెళ్లి అక్కడ నుంచి ఇంటికి వచ్చేశానని తెలిపారు. ‘ఇంటిలో నిద్రపోతున్న నన్ను లేపి గంజాయి తాగావంటూ ఏవేవో మాటలు మా తల్లిదండ్రులకు చెప్పి నన్ను బయటకు తీసుకువెళ్లారు. ఎక్కడెక్కడికో తీసుకువెళ్లి తుపాకీ గురిపెట్టి కేసు ఒప్పుకోవాలని పోలీసులు బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తాం... కేసు ఒప్పుకోవాలని ఆశపెట్టారు. దాడి చేసిన వారిని పట్టుకోకుండా పనులు చేసుకునే మమ్మల్ని పట్టుకుంటే మేము ఏమి చేయగలం’ అని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa