సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన ప్రారంభమైంది. అనంతపురం పార్లమెంటుతో పాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మంగళవారం చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ కౌంటింగ్ ప్రక్రియకు జేఎనటీయూలో ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ గత కొన్ని రోజులుగా కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, అధికారులకు ఆదేశాలిస్తూ వస్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక గదితో పాటు ప్రత్యేక అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa