చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ , ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ... మోహిత్ రెడ్డి సుప్రీం ధర్మానసంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రీపోలింగ్ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ వేయడం సంచలనం కలిగిస్తోంది. మరి సుప్రీం ధర్మాసనం ఏం తీర్పు చెబుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa