పుత్తూరు మాజీ ఎమ్మెల్యే దివంగత గంధమనేని శివయ్య సతీమణి పారిజాతమ్మ(84) ఆదివారం సాయంత్రం మృతి చెందారు. పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన గంధమనేని శివయ్య సీపీఐకి 1970వ దశకంలో కీలక నేతగా వ్యవహరించారు. 1972-77 మధ్యకాలంలో ఈయన పుత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. శివయ్య సతీమణి పారిజాతమ్మ వృద్ధాప్య రీత్యా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చెన్నైలో కన్నుమూసినట్లు కుమారుడు గంధమనేని గౌతమ్ వెల్లడించారు. అంత్యక్రియలు సోమవారం సాయంత్రం చెన్నై కోడంబాక్కం ఎన్టీఆర్ స్ట్రీట్‌లోని స్వగృహంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa