బాలవికాస్ చిన్నారులు చేపట్టిన సంగీత నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. పుట్టపర్తి పట్టణంలోని ప్రశాంతినిలయంలో గల సాయికుల్వంత హాల్లో ఆదివారం తమిళనాడుకు చెందిన బాలవికాస్ విద్యార్థులు సత్యసాయి ప్రేమతత్వంపై నవవిధభక్తి పేరిట సంగీత నృత్యం ప్రదర్శించారు. అలాగే చిదంబరం బాలవికాస్ విద్యార్థులు ఐక్యతతో కూడిన ఆధ్యాత్మిక ప్రేమపేరిట సంగీతనృత్యం ప్రదర్శించారు. పురాణాల్లోని పలు ఘట్టాలను ప్రదర్శించారు. సర్వమతాల్లోని ఐక్యతను తెలియజేసేదే భారతీయ సాంప్రదాయమని నృత్యరూపకం ద్వారా తెలిపారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి సేవాసంస్థల విల్లుపురం ప్రెసిడెంట్ శరవణన, కడలూరు ప్రెసిడెంటు సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa