ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతిలో టీడీపీ నేతలకి ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:36 PM

తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ, స్విమ్స్‌ ఆస్పత్రి వద్ద జరిగిన గొడవల్లో 37మంది టీడీపీ నేతలపై నమోదైన హత్యాయత్నం కేసులో 31 మందికి బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మిగిలినవారు విదేశాల్లో ఉండటంతో వీరు బెయిల్‌ పిటిషన్‌ వేయలేదు. వివరాలిలా.. పద్మావతి మహిళా వర్సిటీ, స్విమ్స్‌ ఆస్పత్రి వద్ద మే 14వ తేదీన టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య గొడవలు, ఘర్షణలు, విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. దీనిపై టీడీపీ నాయకులు కొందరు తమపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ గత నెల 26వ తేదీన తిరుపతి శివారు ప్రాంతమైన తిరుమలనగర్‌కు చెందిన వైసీపీ కార్యకర్త ఎ.రాజీవ్‌ ఎస్వీయూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగిన 12 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కనీసం విచారించకుండా తమపై అన్యాయంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని బెయిల్‌ పిటిషన్‌లో టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత 31మందికి షరతులతో కూడి న బెయిల్‌ని హైకోర్టు మంజూరు చేసింది. ‘బెయిల్‌ మంజూరైన వారంతా ఈనెల 7వ తేదీ వరకు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తిరగకూడదు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఏజెంట్లుగా ఉండకూడదు. ఈనెల 13వ తేదీ వరకు ప్రతి మూడ్రోజులకోసారి రేణిగుంట పోలీసు స్టేషన్‌లో హాజరై, సంతకాలు చేయాలి’ అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa