ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యకేసుని ఛేదించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:38 PM

కాకినాడ జిల్లాప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన మొగలి సతీష్‌(33)దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు సతీష్‌ను హతమార్చి ఉత్తరకంచి పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా పూడ్చివేశారు. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆదివారం ఉత్తరకంచిలోని ఘటనా ప్రదేశంలో మృతదేహాన్ని వెలికితీశారు. సంచలనంగా మారిన ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన మొగలి సతీష్‌(33)కు పదేళ్లక్రితం ఒమ్మంగికి చెం దిన మహిళతో వివాహమైంది. సతీష్‌ సింహాద్రిపురం నుంచి ఒమ్మంగి వచ్చి భార్యతో కలిసి ఉంటు న్నాడు. ఈ క్రమంలో మే 4న తన భర్త మొగలి సతీష్‌ అదృశ్యమయ్యాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు గత 29 రోజులుగా ము మ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తుచేసి సతీష్‌ హత్యకు గురైనట్లు కొనుగొన్నారు. మండలంలోని ఉత్తరకంచి, పొదురుపాక గ్రామాల మధ్య పంట పొలంలో హత్య చేసి పూడ్చివేసిన ప్రదేశాన్ని ఆదివారం ప్రత్తిపాడు తహసీల్దార్‌ నరసింహరావు, సీఐ శేఖర్‌బాబు, ఎస్‌ఐ పవన్‌కుమార్‌, పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని నెలరోజుల క్రితం పూడ్చివేసిన మృతదేహాన్ని వెలికితీసి శవపంచనామా నిర్వహించారు. సతీష్‌ను ఎందుకు హతమార్చారు అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివాహేతర సంబంధంవల్ల జరిగిందా? లేదా పాత క్షకల నేపథ్యంలో సతీష్‌ను హతమార్చారా అనేది తెలియాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa