సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ సంబరాలు నిషేధమని యాడికి అప్ గ్రేడ్ సీఐ నాగార్జునరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కోన రోడ్డులో ప్రజలతో ఆదివారం సీఐ మాట్లాడుతూ జూన్ 6 వరకూ ఎన్నికల కోడ్ ఉంటుందన్నారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విజ యోత్సవ సంబరాలు ర్యాలీలు, బాణ సంచా కాల్చడం తదితర వేడుకలు నిషిద్ధమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa