ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్నాడులో పెట్రో బాంబులు లభ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:40 PM

పల్నాడు జిల్లాలో పోలింగ్‌ హింసాత్మక ఘటనలు ఇంకా మరిచిపోలేదు. పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలువుర్ని అరెస్టు చేసి జైళ్లకు కూడా పంపారు. ఈ పరిస్థితుల్లో కూడా పెట్రో బాంబుల తయారీ సామగ్రి దొరకడంతో అటు పోలీసు అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో పెట్రోల్‌ బాంబుల తయారీ ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి తూర్పు దిక్కుగా ఉన్న ఓ గడ్డివాములో పెట్రోల్‌ బాంబులు దాచి ఉంచారనే సమాచారం ఆదివారం పోలీసులకు అందింది. దీంతో రాజుపాలెం ఎస్‌ఐ షామీర్‌బాషా, సతైనపల్లి రూరల్‌ సీఐ రాంబాబు సిబ్బందితో వెళ్లి ఆ ప్రాంతంలో తనిఖీ చేశారు. పెట్రోల్‌ బాంబుల తయారీకి ఉపయోగించే ముడిసరుకును గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్పీ సోమశేఖర్‌, డీఎస్పీ గురునాథబాబు అక్కడకు వచ్చి వాటిని పరిశీలించారు. బ్రాహ్మణపల్లిపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులను ఆదేశించారు. గ్రామానికి చెందిన గుర్రాల జగన్మోహనరావుకు చెందిన గడ్డివాములో 9 మద్యం క్వార్టర్‌ బాటిళ్లు, 8 ఖాళీ బీరు బాటిళ్లు, 1 ఆఫ్‌ బాటిల్‌, పెట్రోల్‌ నింపిన రెండు లీటర్ల బాటిళ్లు రెండు ఉన్నాయని ఎస్‌ఐ షామీర్‌ బాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వీటితో తమకు సంబంధం లేదని గుర్రాల జగన్మోహనరావు తెలిపారు. ఎవరో గిట్టనివారు ఉద్దేశపూర్వకంగా తమ గడ్డివాములో దాచి కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa