రఫా నగరంలోని గుడారాలపై దాడులు చేసి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు దుమ్మెత్తి పోశారు. ఇజ్రాయెల్ మారణకాండను మోడీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మోడీ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. పాలస్తీనా పోరాటాన్ని బీజేపీ టెర్రరిజంగా చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు. శాంతి కోరే వారంతా వామపక్ష పార్టీలు చేపట్టే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, సోషల్ మీడియా ద్వారా దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించాలని, పాలస్తీనాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa