ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీయే కూటమి విజయంతో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 05:19 PM

కూటమి భారీ విజయం సాధించబోతుందని, కౌంటింగ్‌లో కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు సూచిస్తున్నారు. అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యతతో విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. దుగ్గిరాలలోని కార్యాలయంలో చింతమనేనిని ఆదివారం టీడీపీ శ్రేణులు కలిశారు. ప్రభాకర్‌ మాట్లాడుతూ......  ఐదేళ్ల అరాచక పాలనకు మరో రెండు రోజుల్లో తెరపడుతుందన్నారు. జగన్‌ రెడ్డి రాక్షస పాలనతో ఐదేళ్లపాటు జనజీవనం అస్తవ్యస్తమైందన్నారు. ఎన్డీయే కూటమి విజయంతో సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా రాష్ట్రం పయనిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించిన సీట్లు సాధించి ఎన్డీయే కూటమి దేశం, రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్పారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడంతో ప్రజలు పండుగ చేసుకుంటారని, ఐదేళ్ల జగన్‌రెడ్డి పీడ వదిలిపోతుందని జనం ఇప్పటికే సంబరాల్లో మునిగితేలుతున్నారని ఆయన తెలిపారు. ఎన్డీయే కూటమి విజయం ఎప్పుడో ఖరారైందని, ఇక ఓట్ల లెక్కింపు ఒక్కటే మిగిలి ఉందని, ఎన్డీయే ప్రమాణస్వీకారమే తరువాయి అని ప్రభాకర్‌ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa