సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుండడంతో గూడూరు నిమ్మ మార్కెట్‌కు అసోసియేషన్ సభ్యులు మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రతి బుధవారం నిమ్మ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. అయితే కౌంటింగ్‌ను వీక్షించేందుకు నిమ్మకాయలు లోడింగ్ చేసే కార్మికులు సెలవు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళ, బుధవారాల్లో మార్కెట్‌కు సెలవు ఉంటుంది. రైతులు, ఆటో కార్మికులు గమనించాలని, సోమవారం నుంచి నిమ్మ రైతులు కోతలకు విరామం ప్రకటించాలని వ్యాపారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa