ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభ్యర్థి లేని సమయంలో ఏజెంట్‌ను నియమించుకోవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 05:21 PM

సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఏపీ ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద మరో ఏజెంట్‌ను నియమించుకోవచ్చని ఆయా పార్టీలకు ఈసీ సూచించింది. అభ్యర్థి లేని సమయంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేలా సదరు ఏజెంట్‌కు ఈసారి అవకాశం కల్పించినట్లు ఈసీ స్పష్టం చేసింది. అయితే మిగతా కౌంటింగ్ ఏజెంట్లు అందరూ రౌండ్‌కి రౌండ్‌కి మధ్య రిలాక్స్ అయ్యేలా చర్యలు సైతం చేపట్టింది. అందులోభాగంగా వారికి భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. అయితే ఏపీ అసెంబ్లీలోని భీమిలి, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి 26 రౌండ్లు గరిష్టంగా కౌంటింగ్ జరగనుంది. అలాగే రాజమండ్రి, నరసాపురంలో కనిష్టంగా 13 రౌండ్లకే ఫలితాలు వెలువడనున్నాయి. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంలో 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ లోక్‌సభ నియోజకవర్గ ఫలితం అర్థరాత్రికి వెలువడే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa