పాలస్తీనా రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విజయవాడలో సీపీఐ నేత స్పందిస్తూ యుద్ధం అంటే రెండు దేశాల సైన్యం మధ్య జరగాలని, బలం, బలగం ఉందని ఏకపక్షంగా మరో దేశంపై దాడి చేయడం సబబు కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారత్ ప్రభుత్వం నుంచి ఇజ్రాయెల్‌కు సహకారం ఆపేయాలని డిమాండ్ చేశారు. మోడీ తీరు వల్ల అనేక దేశాల మధ్య సత్సంబంధాలు తగ్గిపోయాయని ఆరోపించారు. ఇజ్రాయెల్ మారణకాండతో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రఫా నగరంలోని శరనార్థుల శిబిరాలపై మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 45మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలు, పిల్లలు ఉన్నారనే విషయం ప్రసార మాధ్యమాల్లో చూసి తీవ్ర కలత చెందినట్లు తెలిపారు. ఈ దాడులు, దారుణాలపై ప్రపంచ వ్యాప్తంగా స్పందన వస్తోందని.. రాష్ట్రం, దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలన్నారు. ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి అందుతున్న సహకారం నిలిపివేసేలా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa