వైసీపీ అరాచక పాలనపై రాప్తాడు నియోజకవర్గం మహిళా నేతల పోరాటం మరువలేనిదని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గం టీడీపీ మహిళా నేతలతో ఆమె సమావేశమయ్యారు. ముందుగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ సతీమణి పరిటాల జ్ఞాన చేతుల మీదుగా మహిళా నేతలకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా సన్మానించారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, వైఫల్యా లతో పాటు చంద్రబాబు సీఎం అయితే కలిగే ప్రయోజ నాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మహిళా నేతలు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. టీడీపీ మెని ఫెస్టోను ప్రజలకు అర్థమయ్యే విఽధంగా వివరించి వారిలో చైతన్యం నింపారన్నారు. పురుషులతో సమానంగా రాప్తా డు నియోజకవర్గంలో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చేలా కష్టపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలతో పాటు మండల కన్వీనర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa