ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయచోటిలో గన్‌తో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఎస్పీ ఆఫీస్‌లోనే, ఆ ఫోన్ కాల్‌తో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 05:30 PM

అన్నమయ్య జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలంరేపింది. రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉన్న ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ వేదవతి గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతికి.. మదనపల్లెకు చెందిన దస్తగిరి ఏడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఐదేళ్ల కూతురు కూడా ఉంది. వేదవతి భర్త దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చి.. ప్రస్తుతం భర్త దస్తగిరితో కలిసి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు పక్కన ఉన్న ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు.


ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. గార్డు గది నుంచి పెద్ద శబ్దం రావడంతో అక్కడే ఉన్న పోలీసులు, సిబ్బంది వచ్చి చూశారు. అప్పటికే వేదవతి చనిపోయినట్లుగా గుర్తించారు. వెంటనే వేదవతి మరణంపై భర్త దస్తగిరికి సమాచారం అందించడంతో ఆయన అక్కడికి వచ్చారు. వెంటనే ఆమె మృతదేహాన్ని రాయ­చోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు ముందు ఓ ఫోన్ కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కుటుంబంలో తలెత్తిన కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తుండగా.. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa