పలాస మండలం కోసంగిపురం సమీప జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను వెనుక నుండి వస్తున్న లగేజీ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు బోల్తా పడగా ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa