మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో, ఎన్డీఏ కూటమి అధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో, పెదపూడి మండలం, పెద్దాడ గ్రామంలో, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు.చంద్రబాబు నాయకత్వంలో,మన రాష్ట్రం పూర్వపు వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలోని నాలుగు కూడలి సెంటర్ వద్ద, బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.