విజయం దిశగా దూసుకుపోతున్నారు కూటమి అభ్యర్థులు. పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు పదో రౌండ్ పుర్తయ్యే సరికి 33,899 ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. ఇంకా రౌండ్లు ఉండడంతో ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
తన సమీప ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఓటమి దాదాపు ఖరారైంది. అలాగే పెందుర్తిలో సీటు దక్కించుకోని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి చివరి క్షణంలో మాడులు నియోజకవర్గం కేటాయించారు. ఆయనను వ్యతిరేకించిన టీడీపీ శ్రేణులను దారికి తెచ్చుకున్న బండారు సత్తా చాటుకున్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలునాయుడు కుమార్తె బూడి అనురాధపై ఆయన సుమారు 8738 ఓట్ల మెజార్టీతో విజయం దిశగా పయనిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa