విశాఖలో కూటమి అభ్యర్థులు మంచి మెజార్టీతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా గాజవాక నుంచి టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి మంత్రి అమర్నాథ్పై 60వేలకు పైగా మెజార్టీతో దూసుకుపోతున్నారు. పల్లా శ్రీనివాసరావు రికార్డు మెజార్టీ క్రియేట్ చేయనున్నారు. ఆదినుంచి గాజువాకలో అమర్ ఓడిపోతాడని ప్రచారం జరిగింది. సర్వేలు కూడా ఇదే తేల్చాయి.
అలాగే విశాఖ దక్షిణంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గెలుపు గ్యారెంటీ అని అంతా భావించారు. కానీ ఇక్కడ కూడా అంచనాలు తలకిందులయ్యాయి. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 40 వేలకు పైగా మెజార్టీతో గెలుపు ఖాయం చేసుకున్నారు.