కేంద్ర కేబినెట్ చివరి సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశంలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ 2.0 ప్రభుత్వానికి ఇదే చివరి కేబినెట్ సమావేశం.ఈ సమావేశంలో ప్రధాని మోదీ తన రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నారు.కాగా, ఇవాళ సాయంత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వ కూర్పు, ఫ్రెండ్లీ పార్టీలకు మంత్రిపదవులు, ప్రభుత్వ కామన్ ఎజెండా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు భవిష్యత్తు కార్యాచరణపైర్చించేందుకు ఇండియా కూటమి నేతలు కూడా సాయంత్రమే సమావేశమవనున్నారు.