కౌంటింగు ప్రశాంతంగా ముగిసేందుకు భద్రతా చర్యలు చేపట్టిన ప్రతీఒక్కరికీ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిసాలి బుధవారం కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర బలగాలతో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఎస్పీ సమావేశమయ్యారు. అందరూ సమిష్టిగా కష్టపడటం వల్లనే జిల్లాలో కౌంటింగు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు.